భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య (Indian Federation of Spiritual Scientists (IFSS))

భారతదేశపు మహోన్నత ఆధ్యాత్మికవేత్తల అఖండమైన శక్తినీ, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల అమోఘమైన కృషినీ సమన్వయించవలెననెడి చిరకాల ఆవశ్యకతకు ఇప్పుడు వేదిక సిద్ధమైంది.. భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య ద్వారా. దీని ద్వారా వాళ్ళ కృషీ, ఆలోచనలూ, సామూహిక చైతన్యాన్ని చేరి నూతన భారత ఆవిష్కరణలో ప్రబలమైన పాత్రను పోషిస్తాయి. ప్రాచీన ఆధ్యాత్మిక వివేకమూ, విద్యావంతులూ, చైతన్యవంతులూ అయిన ఆధునిక యువశక్తీ కలిసి దివ్యజ్ఞానం కలిగిన వ్యక్తులూ, ఐకమత్యంతో కూడిన సమాజమూ, భారతదేశంలో జాతి నిర్మాణం కోసం తయారుచేయబడిన వేదిక ఇది.

IFSS రూపకర్తలు

స్వయంప్రతిపత్తిగల భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్యను రూపొందిచారు

బ్రహ్మర్షి పత్రీజీ

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు


శ్రీమతి ఇందు జైన్

ది టైమ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

IFSS Logo

ఇందులో చిన్న ' i ' వ్యక్తి
తనను తాను
గుర్తించుకునే శరీరం,
మనస్సు, వ్యక్తిత్వాలకు
ప్రాతినిధ్యం వహిస్తే.. పెద్ద 'I'
వ్యక్తి యొక్క శాశ్వత
ఆత్మకు ప్రతీక. ఈ రెండు
'నేను' ల..
i, I ల ..
కలయిక వ్యక్తిగత
గుర్తింపుకూ, శాశ్వతమైన
ఆత్మ గుర్తింపుకూ మధ్య
ఐక్యతకు ప్రాతినిధ్యం
వహిస్తుంది.

Go to top